మాజీ ఎంపీపీ మామ దశదినకర్మకు హాజరైన నాయకులు

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొండూరి శ్రీదేవి మామ కొండూరి మల్సూరు దశదినకర్మకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, నర్సాపూర్ సర్పంచ్ నరసింహ స్వామి, కాటాపూర్ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి దానక నర్సింగరావు, తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, తుడుందెబ్బ, ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love