బైక్‌పై వెళ్తున్న యువకుడిపై దాడి..

నవతెలంగాణ- బీహార్: పాట్నాలో దారుణం జరిగింది. హిందూ యువకుడిపై ముస్లింలు దాడి చేశారు. ఇంతకీ అతను చేసిన తప్పు ముస్లిం యువతితో ఒకే బైక్ పై వెళ్లడమే. హిందూ యువకుడిని చితకబాదిన వీడియోలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడీయోలు వైరల్ గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఆధారంగా పాట్నా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాట్నా నగరంలోని పిర్బహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక మార్కెట్ నుంచి బైక్ పై హిజాబ్ ధరించిన అమ్మాయితో యువకుడు వెళ్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆపి దాడి చేశారు. సాగర్ మిశ్రా అనే యువకుడు తన క్లాస్ మేట్ అని యువతి ఎంత

చెబుతున్నా కూడా పట్టించుకోలేదు. హిందువుకు ముస్లిం యువతితో పనేంటని ప్రశ్నిస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ముస్లిం యువతితో ఎందుకు తిరుగుతున్నామని, ముస్లిం మహిళవై ఉండీ ఏం చేస్తున్నామంటూ గుంపు ఇద్దర్ని ప్రశ్నించడం కనిపిస్తుంది. ఈ ఘటనపై యువతి నుంచి కానీ, యువకుడి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు వెల్లడించారు. వీడియో వైరల్ గా మారడంతో కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love