ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి 

– కల్వకుంట్ల వంశీధర్ రావు
నవతెలంగాణ – చిన్నకోడూరు
ఉచిత కంప్యూటర్ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు అన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో కేఆర్ఆర్ ఫౌండేషన్  ద్వారా అందించనున్న “ఉచిత కంప్యూటర్ శిక్షణ” కార్యక్రమాన్ని బుధవారం ఆ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి విద్యార్థులకు అడ్మిషన్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీధర్ రావు మాట్లాడుతూ.. గత కొన్నియేండ్లుగా తాము కేఆర్ఆర్ ఫౌండేషన్ పేరిట పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనీ, ఆ కార్యక్రమాలను విస్తరించడంలో భాగంగా నిరుపేద యువతకు ఉద్యోగాలు పొందడానికి అవసరమైన శిక్షణను అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఈ కేంద్రంలో రోజుకు రెండు బ్యాచ్ లకు శిక్షణ అందించడానికి సిద్దంగా ఉన్నామని, ఒక వేళ విద్యార్థుల సంఖ్య పెరిగితే.. బ్యాచుల సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం కేవలం నెలకో.. రెండు నెలలకో పరిమితం కాదనీ, నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. ఎంతమంది వస్తే.. అంతమందికి ఉచితంగా శిక్షణ అందిస్తామని, అవసరమైతే సెంటర్ల సంఖ్యను కూడా పెంచుతామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమానికి కూడా మంచి ఆదరణ వస్తుందనీ, ప్రస్తుతం సిద్దిపేట పట్టణ కేంద్రంలో 8 సెంటర్లలో.. అలాగే, నంగునూర్, చిన్నకోడూర్, పెద్దకోడూర్, రాఘవపూర్, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో అంబలి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని తెలిపారు. గత నెల రోజులుగా మొత్తం 13 కేంద్రాల్లో ప్రతి రోజు దాదాపు 13వేల మందికిపైగా అంబలిని సేవిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తమ సేవ కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మట్టల శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయన్న గౌడ్, కాముని హరి, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్,  చిన్న, సురేందర్, ఎజాస్, పాషా, వెంకట్, రాజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, భాస్కర్, జగదీష్, మడూరి వెంకటేష్, సతీష్, రతేందర్, రాజేష్, అఖిల్, రంజిత్, గిరి, సురేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love