చిన్న నిజాంపేటలో కంగుతిన్న చెరుకు శ్రీనివాస్ 

– అడపా దడపాగా చెరుకు ఇంటింటా ప్రచారం
– గుర్తు పట్టని జనం
– కారు కాదు చేతు గుర్తు అంటూ చెప్పిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
దుబ్బాక నియోజక వర్గంలో తిరిగి కాంగ్రెస్ తన పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కావు. నియోజక వర్గంలో ఇప్పటికే తామంటే తాము ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ చెరుకు శ్రీనివాస్, కత్తి కార్తిక, పన్యల శ్రావణ్ కుమార్ రెడ్డిల నడుమ త్రిముఖ పోరు కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. అయితే దుబ్బాక పర్యటనలో వారు ప్రజలను ఇంకా మచ్చిక చేసుకోలేక పోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఉమ్మడి దుబ్బాక మండల కేంద్రంలోని చిన్న నిజాంపేట గ్రామంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ పాదయాత్ర 97 వ రోజుకు చేరుకుంది. మంగళవారం చిన్న నిజాంపేట్ లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన దుబ్బాక ఆత్మ గౌరవ పాదయాత్ర పర్యటన ఉత్తిత్తేగా సాగింది. పర్యటనలో ఓ ఇంటి వద్దకి చెరుకు శ్రీనివాస్ వెళ్లగా ఆయనకి చేదు అనుభవం ఎదరైంది. ఇంటింటా మహిళలను కలుస్తూ ఓటెయ్యాలి గెలిపించాలని అభ్యర్థిస్తుండగా ఓ వృద్ద మహిళతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదా పెన్షన్ విషయం ప్రస్తావించగా చెరుకు శ్రీనివాస్ తో కేసిఆర్ కి ఓటేస్తాం అని వృద్ద మహిళ అన్నది. దీంతో అక్కడున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆయన కార్యకర్తలు కంగుతిన్నారు. కారు కాదు చేతు గుర్తు అంటూ వృద్ద మహిళ కు సర్ది చెప్పారు. చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు గుర్తు పట్టలేదా అని చెప్పి అక్కడున్న వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ వృద్ద మహిళ సాయంత్రం వేళ కావడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫేస్ ఇమేజ్ గుర్తు పట్టలేదని చెరుకు శ్రీనివాస్ రెడ్డి వర్గం కార్యకర్తలు అంటున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. మాదాంట్లో మావోల్లే నన్ను వెన్ను పోటు పొడుస్తున్నారని చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అసలు ఆ వాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియాల్సి వుంది.
Spread the love