రాంసాగర్ నూతన గ్రామ పంచాయతీ

– అనుబంధం నుండి గ్రామ పంచాయతీగా 
– నూతన గ్రామ పంచాయతీగా’రాంసాగర్’..
– హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు 
నవతెలంగాణ-బెజ్జంకి
ఇన్నాళ్లు అనుబంధ గ్రామంగా కొనసాగిన’రాంసాగర్’ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుంది.ఎన్నో ఎండ్లుగా అనుబంధ గ్రామంగా కొనసాగుతూ అభివృద్ధికి అమడ దూరంలో నిలిచిందని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.త్వరలో రాంసాగర్  గ్రామస్తుల నూతన గ్రామ పంచాయతీ కల నెరవేరనుంది.
రాంసాగర్ స్వరూపం..
మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీలో 9,10 వ వార్డులుగా రాంసాగర్ అనుబంధంగా గ్రామంగా కొనసాగుతోంది.గ్రామంలో జనాభా సుమారు 400 ఉండగా ఓటర్లు సుమారు 250 మంది ఉన్నారు.గ్రామస్తుల ప్రధాన వృత్తి వ్యవసాయం..విద్యుత్,ఆర్మీ,పోలీస్ శాఖల్లో  సుమారు 30 మంది ఉద్యోగం సాగిస్తున్నారు.వ్యాపార రంగాల్లో మరికొంత మంది స్థిరపడ్డారు.అన్ని వనరులున్న రాంసాగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటవ్వడంపై గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం 
అన్ని వనరులున్న ఇన్నాళ్లు అనుబంధ గ్రామంగా రాంసాగర్ కొనసాగి అభివృద్ధికి నోచుకోలేదు.గ్రామస్తుల విజ్ఞప్తి మేరకుఎమ్మెల్యే రసమయి బాలకిషన్,ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత చూపిన ప్రత్యేక చోరవ,ఎంపీడీఓ దమ్మని రాము కృషితో నూతన గ్రామ పంచాయతీగా రాంసాగర్ ఏర్పాటవుతుంది.బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలతో రాంసాగర్ గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం.నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు అహర్నిశలు కృషిచేసిన ప్రజాప్రతినిధులు,అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.ఇన్నాళ్లు దాచారం గ్రామంతొ ఉన్న అనుబంధం మరువలేనిది.
-గణపురం తిరుపతి,బీఆర్ఎస్ వై మండల వర్కింగ్ ప్రెసిడెంట్.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నూతన గ్రామ పంచాయతీ…

రాంసాగర్ గ్రామస్తుల విజ్ఞప్తి,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచన మేరకు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసి నివేదికను జిల్లా పరిపాలనాధికారికి అందజేశాం. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మరికొన్ని నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో బాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచన సహకారంతో రాంసాగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుంది.

– దమ్మని రాము,ఎంపీడీఓ బెజ్జంకి.
Spread the love