వృద్దురాలు అత్మహత్య…

నవతెలంగాణ-బెజ్జంకి
అనారోగ్య కారణాలతో వృద్దురాలు అత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తలారివాని పల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వెన్నంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం రాజు నర్సవ్వ వెన్నంపల్లిలోని స్థానికుల ఇండ్ల మద్య గత కొద్ది ఎండ్లుగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ జీవనం సాగిస్తోంది.గురువారం రాత్రి సమయంలో గ్రామస్తులతో సాదకబాధలు పంచుకుంది.శుక్రవారం ఉదయం పశువుల పాక వద్ద ఉన్న వేపచెట్టుకు ఊరేసుకుని అత్మహత్యయత్నానికి పాల్పడగా స్థానికుడు రమేశ్ కాపాడేయత్నం చేశాడు.వృద్దురాలి మృతి చెందడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.ఎస్ఐ నరేందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.మృతురాలి కుటుంబ సభ్యుడు రాజు బాబు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
Spread the love