సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం’సుందరయ్య’

– సీపీఐ(ఎం)మండల కార్యదర్శి శ్రీనివాస్
– సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సూచన
– సీపీఐ(ఎం)అద్వర్యంలో వర్థంతి దినోత్సవం
నవతెలంగాణ – బెజ్జంకి
తన పేరులోని’రెడ్డి’ పదాన్ని తొలగించుకుని అందరూ సమానమేనని చాటి చెప్పి సమానత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పుచ్చలపల్లి సుందరయ్య నిలిచాడని అయన స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రజలకు సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద సీపీఐ(ఎం) అద్వర్యంలో సుందరయ్య వర్థంతి దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం)నాయకులు,స్థానికులు పూలమాలలు వేసి నివాలర్పించారు.సుందరయ్య హంగు ఆర్భాటాలేకుండా సాదాసీదాగా జీవనం గడుపుతూ రాజ్యసభకు ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశలు పాటు పడ్డాడని..నేటి ప్రజాప్రతినిధులు హంగు ఆర్భాటాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయారని.. సుందరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజాప్రతినిధులకు శ్రీనివాస్ సూచించారు.సీపీఐ(ఎం)నాయకులు బోనగిరి లింగం,సంగ ఎల్లయ్య,బోనగిరి అంతయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది బోనగిరి లక్ష్మన్,సంపత్,నర్సయ్య,మొండయ్య,బాలయ్య, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love