నెహ్రూ నగర్ లో ఘనంగా సుందరయ్య 38వ వర్ధంతి సభలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు నగర్ లో సుందరయ్య 38వ వర్ధంతి సభలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ వర్ధంతి సభకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్లు హాజరై సుందరయ్య చిత్రపటానికి పెద్ది వెంకట్రాములు పూలమాల వేసి నివాళులు అర్పించగా., కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న ఎర్ర జెండాను నూర్జహాన్ ఎగరవేశారు. సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నూర్జాన్, పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు నిర్మాతలలో ఒకరైన సుందరయ్య 39వ వర్ధంతి జరుపుకుంటున్నాం. దేశం కోసం నిస్వార్ధంగా, నిరాడంబరంగా జీవించిన కామ్రేడ్స్ సుందరయ్య ఆశయాలను అమలు చేయాలని నెహ్రూ నగర్ గుడిసె వాసులందరికీ పిలుపునిచ్చారు. సుందరయ్య గారి లాంటి మహానుభావులు ఆనాటి ప్రజాస్వామ్యం కోసం స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈనాడు ఆ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చి స్వతంత్ర సమరయోధులు ప్రాణాలర్పించి, త్యాగాలు చేసి, పోరాడి సాధించుకున్న స్వతంత్రాన్ని అబ్బాసుపాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్యన అనైక్యత సృష్టిస్తూ ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని కూడా వక్రీకరిస్తూ చట్టాన్ని తప్పుతోవ పట్టిస్తూ ప్రజల బ్రతుకులను భాగంగా మారుస్తూ రోజురోజుకు అధిక ధరలు పెంచుతూ ప్రజల శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థల వాళ్లకు ఆధాని, అంబానీలకు దేశం మొత్తాన్ని కట్టబెడుతున్నారు. ప్రజారంగ సంస్థలన్నింటిని కార్పొరేట్ సంస్థలకు అందిస్తున్నారు. కార్మిక చట్టాలని,ఉపాది చట్టాన్ని, రైతు చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తూ 1886లో పోరాడి సాధించుకునే 8 గంటల పని విధానాన్ని ప్రైవేటు యాజమాన్యాలకు కార్మిక వర్గ శ్రమను దోచిపెట్టే విధంగా 12 గంటలు అమలు చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉన్నది అని సూచించారు. దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న మహిళ మల్లయోధులను కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేలంతా మహిళలను చులకన భావంతో మాట్లాడుతున్నారు. అడిగిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల మధ్యన చిచ్చులు పెడుతూ విడదీస్తున్నారు. సుందరయ్య లాంటి మహానుభావులు సాధించి తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మరో స్వతంత్ర పోరాటాన్ని చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక శక్తులను తరిమికొట్టడమే సుందరయ్య కి నిజమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, ఫరూక్, గంగామణి జరీనా, రాధిక, రైసా యాస్మిన్ వాసు ,రాములు, నాగమణిగంగమని రాణి పాల్గొన్నారు.

Spread the love