మానవత దృక్పథం ఇమ్మడి గోపి సోడియం…

– హత్యకు గురైన కుటుంబానికి ఆర్థిక సహాయం, బియ్యం అందజేత
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత నెలలో హత్యకు గురైన అ కుటుంబానికి నేనున్నాను తనవంతుగా మానవత దృక్పథంతో సహాయం అందజేసి సహాయకుడిగా నిలిచారు. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నా సమయంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడం వారికి తన వంతుగా ఆర్థిక సహాయం, బియ్యం అందజేసి ఆయనకు మరెవ్వరు లేరు సాటి అని చాటుకుంటు ఆ కుటుంబానికి అండగా నిలవడమే తన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అన్నారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన అక్బర్, నబిసాబ్ ను గత నేలలో బిహార్ కు చెందిన ముగ్గురు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకుని బాధిత కుటుంబానికి తనవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం, అంకె క్వింటాళ్ల బియ్యాన్ని శుక్రవారం బాధిత కుటుంబానికి కలిసి అందజేశారు. జరిగిన సంఘటనపై వివరాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాట్లాడుతూ అక్బర్ నబిసాబ్ కుటుంబం నీరుపేద అని కుంది పనులు చేస్తూ కుటుంబాన్ని గడిపే ఇంటికి పేద్ద హత్య చేయడం బాధాకరమని, మృతునికి ముగ్గురు చిన్నారులు ఉన్నారని, అకుటుంబం ఆపదలో ఉన్న సందర్భంగా తనవంతుగా అ కుటుంబానికి ఎంతో కోంత సహాయం చేయాలనే సదుద్దేశంతో అలాంటి కుటుంబానికి సహాయ సహకారాలు అందజేసినట్లు ఇమ్మడి గోపి వివరించారు. ఆర్థిక సాయం అందజేయడం పట్ల బాధిత కుటుంబం ఇమ్మడి గోపికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.అయన వేంట అబ్దుల్ అజీజ్, అబ్దుల్ మోహ్సిన్ తోపాటు తదితరులు ఉన్నారు.

Spread the love