రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి…

– వ్యవసాయ డివిజన్ అధికారి వినయ్ కుమార్
నవతెలంగాణ –  నసురుల్లాబాద్ 
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బీర్కూర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు డి అశోక్, బాన్సువాడ డిఏఓ వినయ్ కుమార్  అన్నారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో  వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం రాయితీ పై జీలుగా, జనుము విత్తనాలు బీర్కూర్, బైరపూర్, దామరాంచ సహకార సొసైటీల్లో  జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని,  రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  మాట్లాడుతూ రైతు పెట్టుబడులు తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడి అధిక లాభదాయక పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పంటల సాగులో సేంద్రియ ఎరువులను వాడాలని రైతులకు సూచించారు.30 కిలోల జీలుగా బస్తా రాయతీ పోను రైతు చెల్లించవలసిన ధర రూ.843/- మరియు జనుము 40 కిలోల బస్తా ధర రూ.1225/- గా ఉంది. ఈ రెండు బస్తాలు 2 1/2  (రెండున్నర) ఎకరాలకు సరిపోతుంది. రైతులు విత్తనాలు పొందాలంటే తప్పనిసరిగా పటేల్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మరియు మొబైల్ నెంబర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ తనబుద్ది స్వరూప, మండల వ్యవసాయాధికారిని కమల, సీనియర్ ఏఈఓ శ్రావణ్ కుమార్, ప్రాథమిక సహకార సంఘం సీఈఓ విఠల్, డైరెక్టర్ రాములు, పోషెట్టీ, రైతులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love