నవతెలంగాణ – చేర్యాల: చేర్యాల పట్టణం పదవ తరగతి 1988-89 బ్యాచ్ కు చెందిన భూమిగారి జనార్ధన్ కూతురు వైద్య చికిత్సకు అందుబాటులో ఉన్న పూర్వ విద్యార్థులు శుక్రవారం రూ. 28వేల నగదు, 25 కిలోల బియ్యంతో పాటు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బచ్చు మురళి, మమ్మద్ రఫత్ ఉమర్, బుట్టి సత్యనారాయణ, అంబటి అంజయ్య, కర్రోల్ల నవజీవన్, బర్రె యాదిరెడ్డి, బొడ్డు దేవదాస్, పచ్చిమడ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.