ఖాళీ స్థలాలలో చెత్త వేస్తే జరిమానా

– మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు

నవ తెలంగాణ – సిద్దిపేట
ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న చెత్తను పారవేస్తే జరిమానా విధించడం జరుగుతుందని, తమ ఇంటి నుంచి వచ్చే చెత్తను మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు సూచించారు. పట్టణ 30వ వార్డులో ఓపెన్ ప్లాట్ లలో వేసిన చెత్తను జెసిబి, డోజర్ల సహాయంతో తొలగించారు. జరుగుతున్న పనులను స్ధానిక వార్డు కౌన్సిలర్ ఫాతిమా బేగం-వజీర్ లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లు, కవర్ లను, చెత్తను కాళీ స్థలాలలో వేస్తే దోమలు వృద్ధి చెంది అనేక రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుందని, తమ ఇంటి ముందుకు వచ్చే వాహనాలకే చెత్తను వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మాధవి మైకు ద్వారా వార్డుల్లో పర్యటిస్తూ ఖాళీ స్థలాలలో చెత్తను వేయవద్దని ప్రజలను చైతన్యం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు
 మోయిజ్, జవాన్ శంకర్, సిబ్బంది హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Spread the love