గొల్ల కురుమల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గొల్ల కురుమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్, ఆరేపల్లి యాదవ కమ్యూనిటీ భవనంలో వేరువేరుగా రెండో విడత గొర్ల పంపిణీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీతో ప్రతి గొల్ల కురుమ లకు గొర్లను అందిస్తుందన్నారు. గొల్ల, కురుమ లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ప్రతి గొల్ల కురుమ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ ప్రభుత్వం కూడా గొల్ల కురుమల సంక్షేమానికి పాటుపడలేదని ,సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటరెడ్డి, పశువైద్యాధికారి అజయ్, కౌన్సిలర్లు మ్యాధరబోయిన వేణు, దొడ్డి శ్రీనివాస్ వల్లపు రాజు , కో ఆప్షన్ సభ్యులు ఐలేని శంకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్న బోయిన దేవేందర్, అరపల్లి గొర్ల పెంపకం దార్ల సహకార సంఘం అధ్యక్షులు కాశ బోయిన సంపత్, హుస్నాబాద్ గొర్ల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు చౌదరి అశోక్ యాదవ్, యాదవ సంఘం అధ్యకుడు గొర్ల కొమురయ్య,గొర్ల పెంపకం దారులు గొర్ల ఆశయ్య, గొర్ల వెంకన్న, కాశబోయిన మల్లేశం, దొంతర బోయిన శ్రీనివాస్, గడ్డం కొమురయ్య, కాశ బోయిన రవీందర్, అవుకు వెంకన్న, ముడిక సంపత్ , నారాయణ , శరభందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love