ఈత వనాల పెంపకంతో జీవానోపాధి మెరుగు..

– లక్ష్మిపూర్ లో ఈత మొక్కల నాటిన అబ్కారీ సీఐ దామోదర్
– సర్పంచ్ ను అభినందించిన సీఐ
నవతెలంగాణ-బెజ్జంకి
ఈత వనాల పెంపకంతో గ్రామంలోని గౌడ కులస్తులకు జీవానోపాధి మెరుగుపడుతుందని అబ్కారీ శాఖ హుస్నాబాద్ డివిజన్ సీఐ దామోదర్ అన్నారు. బుదవారం మండల పరిదిలోని లక్ష్మిపూర్ గ్రామ ముక్కీస చెరువు కుంట అనకట్టపై సర్పంచ్ ముక్కీస తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ ముక్కీస పద్మ, వార్డ్ సభ్యులు, గౌడ కులస్తులతో కలిసి అబ్కారీ శాఖ సీఐ దామోదర్ ఈత మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు,గౌడ కులస్తులు పరస్పర సహకారంతో నాటిన ఈత మొక్కలను సంరక్షించాలని సీఐ సూచించారు.ఈత మొక్కల పెంపకానికి కృషిచేసిన సర్పంచ్ ముక్కీస తిరుపతి రెడ్డిని సీఐ అభినందించారు.కో అప్షన్ సభ్యులు మహిపాల్ రెడ్డి, పీల్డ్ అసిస్టెంట్ పల్లే శారధ,మాజీ ఎంపీటీసీ ముక్కీస తిరుపతి రెడ్డి,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముక్కీస రాజిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖాధ్యక్షుడు ముక్కీస తిరుపతి రెడ్డి, అబ్కారీ శాఖాధికారులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.
Spread the love