మూడోసారి సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర

నవతెలంగాణ హైదరాబాద్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఆమె బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్‌ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమన్స్‌ మాట్లాడుతూ.. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించబోతున్నందున తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు. నేను ఇంటర్నేషన్‌ స్పేస్‌సెంటర్‌ కేంద్రానికి వెళ్లిన సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్టుగా ఉంటుందన్నారు.
అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండోస్థానంలో నిలిచింది. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు నెలకొల్పారు. సునీతా విలియమ్స్‌కి ఇది మూడో అంతరిక్ష యాత్ర. ఇంతకు ముందు 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. రెండు మిషన్లలో 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు.

Spread the love