నవతెలంగాణ – చేర్యాల
పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి, పెద్ద రాజపేట గ్రామాల ఉన్నత పాఠశాలల టాపర్స్ ఐశ్వర్య, కీర్తన,అక్షిత లను మంగళవారం మండల కేంద్రంలోని రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ లో సేల్స్ మేనేజర్ దండు దయాకర్ సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కిష్టయ్య, ఉపాధ్యాయులు ధర్మారెడ్డి, బాలభాస్కర్, నూజాహత్ జహాన్, విజయ్ కుమార్, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.