తప్పిన పేను ప్రమాదం…

– విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో గేదె మృత్యువాత.. బాధితుడు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత నాలుగు రోజుల క్రితం పంట పొలాలకు వచ్చే విద్యుత్ తిగలు తేగిపోయి కింద వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఒక గేదె విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన ఇందల్ వాయి మండలంలోని మేగ్య నాయక్ గ్రామ పంచాయతీ పరిధిలోని తిర్మలయ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు డిచ్ పల్లి మాజి వైస్ ఎంపిపి పూర్య నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నల్లవెల్లి సబ్ స్టేషన్ పరిధిలోని తిర్మలయ తండా లో గత నాలుగు రోజుల క్రితం రాసింది వేంట రాకపోకలు సాగించే ఓక వాహనం విద్యుత్ తిగలను తగిలి తిగలు కింద వేలాడుతున్న యని, ఎల్లారెడ్డి పల్లి సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ ఇంచార్జీ ఏఈ కి పూర్య నాయక్ ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. అనాటి నుండి నేటి వరకు తెగి కింద వేలాడుతున్న విద్యుత్ తిగలను సారి చేయకపోవడం తో పూర్య నాయక్ కు చెందిన ఒక గెదే 85 వేల రూపాయలు విలువ ఉన్న గెదే ఉదయం వరి పంట పొలాలు కోతలు పూర్తి కావడంతో గెదేలు గడ్డి మేయడానికి వేళ్ళగా గెదేకు ప్రమాద వశాత్తూ విద్యుత్ తిగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్లు అయన తెలిపారు.ఇంక నేను ప్రమాదం తప్పిందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, ఎవరైనా రైతులు అక్కడికి వెళ్లి ఉంటే వారి ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతుండేనని అయన పేర్కొన్నారు.తండాకు అనుకుని పంట పొలాలు ఉన్నాయని,ఒక మాజీ వైస్ ఎంపిపి సమాచారం ఇచ్చిన పట్టించుకోక పోవడంతో నే ఈ సంఘటన జరిగిందని అయన ఆరోపించారు. సమాచారం ఇచ్చిన అధికారి సమయానిక స్పందించి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదని, విద్యుత్ శాఖ అధికారులు తనకు నష్టపరిహారం చెల్లించాలని అయన కోరారు.ఇకనైన అధికారులు స్పందించి వేంటనే తెగి పోయిన విద్యుత్ తిగలను సారి చేసి ప్రాణ నష్టం జరిగకుంట చుడాలని అయన కోరారు.

Spread the love