కార్మిక హక్కులు, రాజ్యాంగం రక్షణకు బీజేపీని ఓడించాలి

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మాచారి
నవతెలంగాణ-చర్ల
కార్మికహక్కుల రక్షణ, రాజ్యాంగం పరిరక్షణ కోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మాచారి కార్మికులకు విజ్ఞప్తిచేశారు. సీఐటీయూ మండల కమిటీ సభ్యురాలు విజయశీల అద్యక్షతన పార్లమెంట్‌ ఎన్నికలు, కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో బ్రహ్మాచారి ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో అవినీతి చట్చబద్ధం చేశారని, అందుకు ఎన్నికల బాండ్లు ఒక ఉదహరణ అని పెర్కొన్నారు. కార్పోరేట్‌ కంపెనీల స్పాన్సరింగ్‌తో బీజేపీ నడుస్తుందన్నారు. 10 సంవత్సరాల పాలన మొత్తం బాడా బడా సంపన్నుల సేవతోసాగిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్ధు చేస్తామని బీజేపీ ఎంపీలు, మంత్రులు బహిరంగంగా ప్రకటించటం గమనిస్తే దేశంలో ప్రజాస్వామ్యం నియతత్వంగా మారిపోయిందని అర్ధమవుతుందని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా స్వయం ప్రతిపత్తితో పనిచేయవలసిన ఎన్నికల, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్ధలను బీజేపీ తనజేబు సంస్ధలుగా మార్చిందన్నారు. కార్మిక చట్టాలను, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కమలం పార్టీని ఓడించకపోతే దేశం ఇవే చివరిఎన్నికలుగా మారతాయన్నారు. ధరల నియంత్రణ, ఉద్యోగ ఉఫాది అవకాశాల కల్పనలో భారతీయ జనతా పార్టీ విఫలమైందన్నారు. భక్తి, మతం వంటి సున్నితమైన విషయాలను రాజకీయాలకు వాడుకుని విద్వేశాలను రెచ్చగొడుతుందన్నారు. భక్తి, మతం అని ముసుగులో బీజేపీ సాగిస్తున్న ఆర్ధిక, సామాజిక, సాంస్కాతికి దోపిడిచేస్తుందని చెప్పారు. బీజేపీ ఓటమి కోసం ప్రతి కార్మికుడిని కలిసి ప్రచారం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కరపత్రాలు బుక్‌ లెట్స్‌, సదస్సులు, జనరల్‌ బాడీసమావేశాలు, కార్మిక నివాస ప్రాంతాలలో ప్రచారం చేయాలని సీఐటీయూ నిర్ణయిందని తెలిపారు. ఈ సదస్సులో సీఐటీయూ మండల నాయకులు, ఆటోయూనియన్‌ అద్యక్షులు పామరు బాలాజి, సోడిపద్వీ, లక్ష్మి, విజరు, నర్సింహారావు, కిషోర్‌, సావిత్రి, సుభద్ర, ఇర్పసత్యవతి, అంజమ్మ, నవీన్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love