నామినేషన్ల పరిశీలన పూర్తి

– 19 మంది నామినేషన్ల తిరస్కరణ
– 38 మంది నామినేషన్లు ఆమోదం
– సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో కలెక్టర్‌ పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల సమక్షంలో హైదరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి నామినేషన్‌ పత్రాలను క్షణంగా పరిశీలించారు. ఈ నామినేషన్ల పరిశీలన ప్రక్రియను హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు పీఐ శ్రీవిద్య ఐఏఎస్‌ పర్యవేక్షించారు. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానానికి మొత్తం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. క్రమ పద్ధతిలో వాటిని పరిశీలించి వివరాలు, పత్రాలు సక్రమంగా ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు. లోపాలున్నా, సరిగ్గా వివరాలు సమర్పిం చని 19 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఒక్కొక్క నామినేషన్‌ పత్రానికి సంబంధించి వివరాలు, పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని రిటర్నింగ్‌ అధికారి, కలె క్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. 57మంది అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేయగా, వివరాలు సరిగ్గా లేని 19 మంది నామినేషన్లను తిరస్కరించినట్టు కలెక్టర్‌ వెల్లడించారు. 38 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్టు పేర్కొ న్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ అమౌంట్‌ను తిరిగి చెల్లిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎందుకు నామినేషన్‌ తిరస్కరణకు గురైందో అందుకు సంబంధించిన వివరాలనూ అభ్యర్థు లకు అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఏఆర్వోలు, అధికారులు, అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్‌లో 41 మంది నామినేషన్లు ఆమోదం
ఇదిలావుంటే సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో(08) మొత్తం 57 మంది నామినేషన్లు సమర్పించారు. 11 మంది నామినేషన్లు తిరస్కరించారు. 41 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

Spread the love