రఘు బాబు స్మారక నాటకాల పోటీలు..

నవతెలంగాణ-కల్చరల్‌
రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై జరుగుతున్న పరుచూరి రఘు బాబు స్మారక 34 వ జాతీయ స్థాయి నాటక నాటిక పోటీలలో భాగంగా రెండవ రోజు డాక్టర్‌ రామన్‌ ఫౌండేషన్‌ సాయిబాబా నాట్య మండలి విజయ వాడ వారు ”విజ్ఞాన భారతం” నాటకం ప్రదర్శించారు. అమెరికాలో సైంటిస్ట్‌ గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిన నాస్తికుడైన లక్ష్మీపతి, స్వదేశంలో పౌరోహిత్యం చేస్తూ భారత సంప్రదాయాలను కాపాడాలని తపిస్తూ తన మేనల్లుడిని కూడా అదే వృత్తిలో పెట్టిన రామ శాస్త్రి అన్నదమ్ములు. దూరవిద్యలో సంస్కృతం ఎంఏ చేసిన ఆ మేనల్లుడు ప్రపంచ స్థాయి మేధావుల పోటీలో భారత దేశం నుండి ఎన్నికైతాడు. అలాగే అమెరికా లో స్థిరపడిన చినమామతో ఫైనల్లో తలపడి భారతదేశం పది వేల సంవత్సరాల క్రితమే విజ్ఞానం పొంది ఉందని సైంటిఫిక్‌ గా శాస్త్ర ప్రమాణంగా నిరూపించి మిలియన్‌ డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ పొందుతాడు.
తర్వాత అమరావతి ఆర్ట్స్‌ గుంటూరు వారు ”అమృత హస్తం” నాటిక ప్రదర్శించారు. అనారోగ్య సమస్యలతో, భర్త పెడుతున్న కష్టాలను భరించ లేక తన అన్న ఇల్లు చేరిన చెల్లెలిని అక్కున చేర్చుకోవా ల్సిన బాధ్యత ప్రతీ సోదరుడిదే అని ముందుకు వచ్చి చేయూత నివ్వాలని అది చెల్లెలికి అమృత హస్తం కావాలని అని సందేశం ఈ నాటిక
అనంతరం, పర్యావరణాన్ని కాపాడ వలసిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందన్న ఇతివృత్తంతో అభ్యుదయ ఆర్ట్స్‌ విజయవాడ వారు ”భూగోళం” నాటికను ప్రదర్శించారు. తరువాత సిరిమువ్వ కల్చరల్స్‌ హైదరాబాద్‌ వారి ”దారుణం” నాటిక ప్రదర్శన జరిగింది. రక రకాల యాప్‌ ల ద్వారా లోన్‌ తీసుకొన్న వారి బంధువులను నీచమైన వేదనలకు గురిచేయగా ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలను చూపి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఈ నాటిక సందేశం.
తరువాత పండు క్రియేషన్స్‌, కొప్పోలు వారి ”పక్కింటి మొగుడు” హాస్య నాటిక ప్రదర్శన జరిగింది. అనంతరం చివరి ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారు ”మూల్యం” నాటికను ప్రదర్శించారు. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్న తండ్రికి తన కిడ్నీ దానం చేయడానికి ఆవిడ భర్త నో అబ్జెక్షన్‌ కోరిన ఆస్పత్రి వర్గాల పైన, అనుమతి నిరాకరించిన భర్త పైన న్యాయస్థానంలో ఛాలెంజ్‌ చేసి గెలుస్తుంది జయతి. కానీ, కోర్టు వ్యవహారంతో అప్పటికే ఆలస్యం అయిన కారణంగా తండ్రిని కోల్పోతుంది.

Spread the love