తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్ నాలుగో వార్షికోత్సవం.. 

– తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్స్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్స్ కు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు రావడానికి స్వాగతిస్తున్నామని టి సి సి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భాస్కర్ అన్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ నాలుగవ వార్షికోత్సవం శుక్రవారం రామ్  కోఠి లోని వెస్లీ సెంటినరీ చర్చి లో నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రధాన చర్చిలకు చెందిన  ప్రతినిధులు పాల్గొన్నారు‌ ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం..
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చిస్స్ చైర్మన్ గా బిషాప్ పద్మారావు వైస్ చైర్మన్ గా ఎంఏ డానియల్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ టి భాస్కర్, కోశాధికారిగా రాబర్ట్ సూర్య ప్రకాష్, లో తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు సభ్యులు ఏకేగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి భాస్కర్ మాట్లాడుతూ.. టి సి సి కె ఎన్ సి సి ఐ గుర్తింపు రావడం తమకు సంతోషం కలిగించిందన్నారు. పేద, అణగారిన వర్గాల కు  చేయూతను అందిస్తున్నామన్నారు. అలాగే కులమతాలకు అతీతంగా అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. దళితులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిసిసి నీ బలోపేతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రూబన్ మార్క్, ఫిలిప్ రాజ్, జ్యోతి సుందర్, విజయ పద్మారావు, స్టీవెన్, జాన్ రవీందర్, తిమోతి, వివిధ జిల్లాలకు చెందిన చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love