’42 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఎలా ఇచ్చింది’

– వెంటనే ఆ భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలి
– అవినీతి నిర్మూలన ధర్మ యుద్ధ సంఘం
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున గన్‌ ఫౌండ్రీలోని మహబూబ్‌ కాలేజీ ఎదురుగా నిర్మిస్తున్న 42 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఎలా ఇచ్చిందని అవినీతి నిర్మూలన ధర్మ యుద్ధ సంఘం ప్రశ్నించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివకాంత్‌, ప్రధాన కార్యదర్శి ఎం.పురుషోత్తం, ఉపాధ్య క్షులు విజరు కుమార్‌ తదితరులు మాట్లాడుతూ నిత్యం జన జీవనంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో 42 బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఎలా ఇస్తారని, ఆ భవన నిర్మాణ అనుమతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కోర్టును ఆశ్రయి స్తామని వారు హెచ్చరించారు. ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణం వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడు తుందని, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ప్రమాదం కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభు త్వ హయాంలో ఈ 42 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చిందని, ఒకటిన్నర ఎకరం స్థలంలో ఇప్పటికే 22 అంతస్తులు నిర్మించడం జరి గిందన్నారు. మరో 20 అంతస్తులు నిర్మించడానికి పనులు శరవేగంగా కొనసా గుతున్నాయని, ఆ పనులను వెంటనే ఆపి జీహెచ్‌ఎంసీ నోటీసులు అందజే యాలని డిమాండ్‌ చేశారు. ఈ నిర్మాణానికి అనుమతిని రద్దు చేయాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు వారు చెప్పారు.వెంటనే ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని అనుమతిని రద్దు చేసి స్థానిక ప్రజలను కాపాడాలని వారు కోరారు.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ నిర్మాణాలు విచ్చల విడిగా నగరంలో కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Spread the love