– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యానగర్ బీసీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ ఆర్.కష్ణయ్య హాజరై మాట్లాడుతూ గ్రూప్-1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించారు. కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600కు, గ్రూప్-2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని కూడా కరెక్టుగా లెక్కిస్తే 2200 లకు, గ్రూప్-3 పోస్టులు 1383 వాస్తవంగా 3వేలకు పైగా ఉన్నవి, గ్రూప్-4 సర్వీస్ కోటా కింద 8500 పోస్టులు ప్రకటించారు. ఇవి 25 వేలకు పైగా ఉంటాయి. టీచర్ పోస్టులు 11వేలు ప్రకటించారు. పీఆర్‌సీ రిపోర్ట్ ప్రకారం 25 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు వేరువేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్థులు ఈ మూడు నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలలో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతారు. ఒకే యాజమాన్యం పాఠశాల లో జాయిన్ అవుతారు. సెలెక్ట్ అయిన మిగతా మూడు వధా అవుతాయి. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కొత్త తరాన్ని యువతరాన్ని డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుందని, యువత శక్తి-యుక్తులు సమాజాభివద్ధికి ఉపయోగించవచ్చునని యువతను పాలనరంగంలోకి తీసుకువస్తే ఉత్సాహంతో, అంకిత భావంతో నిజాయితీగా పని చేస్తారని తెలిపారు. ఈ ర్యాలీలో గుజ్జా కష్ణ, వేముల రామకష్ణ, సి.రాజేందర్, మధుసూదన్, అనంతయ్య, నందగోపాల్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.