– శ్రీరామ నవమి పండుగ సమన్వయ సమావేశంలో పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
శ్రీరామ నవమి శోభా యాత్రలో ఎలాంటి రాజకీయ చిహ్నాలు, రాజకీయ ప్రసంగాలకు అనుమతి ఉండదనీ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అన్నారు. రాబోయే శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని మంగళ్‌హౌట్‌లోని సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో అంతర్-విభాగాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, అగ్నిమాపక, ఆర్టీఏ, టీఎస్‌ఆర్‌టీసీ, వాటర్ వర్క్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రాంతాలలో చెట్ల నరికివేత, బారికేడింగ్, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు తదితర ప్రాం తాల్లో జరుగుతున్న పనులను వారు వివరించారు. గత సంవత్సరం ఊరేగింపులో జాప్యానికి కారణ మైన కీలక సమస్యలను సరిదిద్దాలని నిర్వాహ కులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పండుగ సజావు గా జరిగేందుకు రాబోయే ఎన్నికలకు సంబంధించి, మేము భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నైతిక నియమావళిని అనుసరిస్తామనీ, అందరూ అనుస రించాలన్నారు. శోభా యాత్రలో ఎలాంటి రాజకీ య చిహ్నాలు లేదా రాజకీయ ప్రసంగాలకు అనుమతి ఉండదన్నారు. ఇతరత్రా అత్యవసర పరిస్థితుల కోసం హైదరాబాద్ కంట్రోల్ రూమ్‌ను వెంటనే సంప్రదించాలని, శోభాయాత్రకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ”శోభా యాత్రకు సిటీ పోలీసులు విస్తతమైన భద్రతా ప్రణాళికను రూపొందించామన్నారు. ఉత్సవ సమి తి సభ్యులు ఉప ఊరేగింపులను సరైన పద్ధతిలో ప్రధాన ఊరేగింపు మార్గంలో కలుసుకునేలా సహకరించాలన్నారు. ప్రజలు కూడా పోలీసులకు, వాలంటీర్లకు సహకరించి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ సమావేశంలో గత సంవత్సరం శోభాయాత్రలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు అదనపు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికా రులు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి నట్లు తెలిపారు. శ్రీరామ నవమి శోభ యాత్రను ప్రశాంతంగా నిర్వహించుకుందామన్నారు. ఉత్సా హానికి హద్దులు దాటవద్దని.. భక్తులు అధికారులకు సహకరించాలనీ సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, శోభాయాత్రలో రాజకీయ జెండాలు, రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసు కోవాలన్నారు. కావాల్సిన జాగ్రత్తలు, సూచనలు వివిధ విభాగాల అధికారులతో, జీహెచ్‌ఎంసీ జోనల్ కమీషనర్ లతో కలిసి ప్రణాళికలు సిద్దం చేశారన్నారు.
హనుమాన్ వ్యాయామశాల సందర్శన..
శోభాయాత్ర వెళ్లే మార్గాలను అడిగి తెలుకు న్నారు. ఆ మార్గాల అనుసందానం ఆధారంగా సూచనలు చేశారు. అనంతరం నిర్వాహకులు జోనల్ కమిషనర్ బి.హేమంత్ సహదేవ్ రావు, ఇతర శాఖల అధికారులు 6.8 కి.మీ మేర ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. హనుమాన్ వ్యాయామశాలను అధికారులతో కలిసి సందర్శిం చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ విక్రమ్ సింగ్ మాన్, కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు కమీషనర్ వి సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావు, డిప్యూటీ కమిషనర్లు టీఎస్ పిడిసిఎల్, అర్ అండ్ బీ, మెడికల్, వాటర్ వర్క్స్ సీనియర్ అధికారులు , ఫైర్, అర్టిఓ ఉత్సవ సమితి సభ్యులు డా.భగవంత రావు, కష్ణ, ఆనంద్ సింగ్, గోవింద్ రాతి, కిరోడి మాల్ సమావేశానికి హాజరయ్యారు.