– ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కాలేజీ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాబోయే భవిష్యత్ అంతా ఏఐదేనని ఇంజి నీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జీ. రామేశ్వర్ రావు తెలిపారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇఎస్‌సీఐ), ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అండ్ మెషిన్ లర్నింగ్స్ ప్రాముఖ్యతపై ఒక రోజు నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఎస్‌సీ కళాశాల ప్రాంగణంలోని చాణక్య సెమినార్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివి ధ కళాశాలల నుండి 200 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండి యా డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్ రావు మాట్లాడుతూ నేటి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఏఐ అండ్ ఏంఎల్ ప్రాముఖ్యత బాగా పెరిగిందన్నారు. ప్రతి రంగంలో కత్రిమ మేథస్సు కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా, ఔత్సా హిక ఇంజనీర్లకు కీలకమైన నైపుణ్యతతో కూడిన పాత్రను ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ పోషిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నెలకొల్పిన ఇఎస్‌సీఐ సంస్థ ఆసియాలో ఇదొక్కటే ఉందని అన్నారు. ఇఎస్‌సీఐ సంస్థ సంవత్సరానికి సుమారు 350 శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఇంజనీర్లకు వివిధ రంగాల్లో అనుభవజ్ఞులతో కావాల్సిన శిక్షణ అందుస్తున్నామని తెలిపారు. మాజీ భారత రాష్ట్ర పతి, మిసైల్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం కూడా ఈ కేంద్రంలో నాటి ఇంజ నీర్లకు శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. గౌరవ అతిధులుగా హాజ రైన ప్యూచర్లీ ఇంక్ ఫైట్ క్లబ్ సహ వ్యవస్థాప కులు ప్రమోద్, వాల్మార్ట్ అండ్ ల్యాబ్స్, ఫైట్ క్లబ్ నుండి స్టాప్ డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ నితిన్ కిషోర్ తమ అనుభవానలు పంచుకున్నా రు. ఆరోగ్య సంరక్షణ, నావిగేషన్, వ్యవసాయంతో పాటు గా ఇంకా ఎన్నో రంగాలల్లో ఏఐ ఆవిష్కరణలు వచ్చాయని తెలి పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయనే మాట తప్పన్నారు. ఏఐ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొ స్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలేజీ జోగినపల్లి భాస్కర్, శాంతి, శ్రీమతి దుర్గా భవాని, ఇఎస్‌సీఐ లోని ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సెల్ హెడ్ పీ.సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.