లోక్‌ సభ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

– ఎన్నికల వేళ రౌడీ షీటర్లపై నిఘా
– రాచకొండ సీపీ తరుణ్‌ జోషి
నవతెలంగాణ-హాయత్‌నగర్‌
లోక్‌ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపడుతున్న భద్రత ఏర్పాట్లను, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శుక్రవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డా… తరుణ్‌ జోషి రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీ లు, ఏసీపీ,ఇతర అధికారులతో నాగోల్‌ లోని ఓ కాలేజీలో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే లోక్‌ సభ నియోజకవర్గాలలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ లోక్‌ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని స్థాయిల రాచకొండ సిబ్బంది సమాయత్తమై ఉన్నారని చెప్పారు. మల్కాజిగిరి, హైదరాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ లోక్‌ సభ నియోజకవర్గాల నుంచి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజ కవర్గాలు, మండలాల వారీగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాచకొండ పరిధిలో పలు జిల్లా సరిహద్దులు ఇతర ప్రధాన రహదారి మార్గాలలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద ఇప్పటికే పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని చెక్‌ పోస్టుల వద్ద బారికేడ్లు, టెంట్లు, కుర్చీలు, లైటింగ్‌ వ్యవస్థ, సమా చార సాధనాలు, సీసీ కెమెరాల వంటి వాటిని ఏర్పాటు చేశామని తెలిపారు. రాచకొండ పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ రక్షణ బృందాలు కూడా చెక్‌ పోస్టుల వద్ద తగిన సంఖ్యలో బందోబ స్తు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ సూచించారు. అధికారులు క్రమం తప్పకుండా చెక్‌ పోస్టుల వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను, సిబ్బందిని తనిఖీ చేస్తున్నట్టు, ఆయా జోన్లు డివిజన్ల వారీగా ఉన్నతాదికారులు అకస్మాత్తు తనిఖీలు కూడా నిర్వహి స్తున్నట్టు, తనిఖీల్లో పాటించ వలసిన విధానాలను, చట్టపరమైన నిబంధనలను సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పరిమితికి మించిన నగదు ఇతర వస్తువుల వంటి వాటిని సీజ్‌ చేసే క్రమంలో డీసీపీ,అదనపు డీసీపీ స్థాయి అధికారులు ఎన్నికల కమి షన్‌ నిబంధనలకు అనుగుణంగా చెక్‌ పోస్టుల తనిఖీ సిబ్బంది పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఎన్నికల నిబంధ నలకు సంబంధించి ప్రతీ అంశంపై అధికారులు సిబ్బంది సం పూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బం దికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగా హనను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్‌ పోలీసింగ్‌ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచిం చారు.ఎన్నికల నిర్వహణలో క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు, వల్నరబుల్‌ పోలింగ్‌ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండా లని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్‌ చెక్‌ చేసుకో వాలని పేర్కొన్నారు. గత ఎలక్షన్స్‌ సమయంలో సమస్యలు సష్టించిన వారిపై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్‌ ను, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నవారిని, హిస్టరీ షీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేయాలని తెలిపారు.ఎన్నికల సమయంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య, గొడవలు సష్టంచే అవకాశం ఉన్న సోషల్‌ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్‌ చేసే విషయాలు, చిన్న విషయాలైనా ఉన్నతా ధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్‌ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి గ్రామాలపై దష్టిసారించాలని తెలిపారు.ఈ సమావేశంలో యాధాద్రి డీసీపీ రాజేశ్‌ చంద్ర, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎల్బి నగర్‌ డీసీపీ ప్రవీణ్‌ కుమార్‌, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఎస్బి డీసీపీ కరుణాకర్‌, డీసీపీ సైబర్‌ క్రైమ్‌ చంద్ర మోహన్‌, ట్రాఫిక్‌ డీసీపీ మనోహర్‌, షీ టీం డీసీపీ ఉష విశ్వనాథ్‌, డిసిపి ఎస్‌ ఓ టీ మురళీధర్‌, అదనపు డీసీపీలు నరసింహారెడ్డి, శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love