కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై 10వ తేదీ తీర్పు

నవతెలంగాణ – ఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనిపై మే 10వ తేదీన మధ్యంతర ఆదేశాలను వెలువరిస్తామని జస్టిస్‌ ఖఢిన్నా నేడు వెల్లడించారు. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామని తెలిపారు. ఈ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Spread the love