నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు మరో షాక్ తగిలింది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం సీఎం వారానికి రెండుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఉన్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఊరటనిచ్చేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించారు.