నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకల్లో పీర్ల ఊరేగింపులో శనివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మొహర్రం వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకమని.. మతాలకతీతంగా జరుపునే మొహర్రం వేడుకల్లో ప్రజలందరూ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే రసమయి సూచించారు.