ప్యాంటులో పాములతో ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రయాణికుడు

నవతెలంగాణ – న్యూయార్క్‌: ప్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది గుర్తించారు. గత నెల 26న ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని ఫ్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో పాములను గుర్తించారు. కళ్లద్దాలు (షేడ్స్‌) దాచుకునే సంచిలా ఉన్న వస్తువు నుంచి రెండు తెల్ల పాములను స్వాధీనం చేసకున్నారు. అనంతరం వాటిని ఫోరిడా మత్స్య, ఫ్ప్రాణి సంరక్షణ కమిషన్‌ అప్పగించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Spread the love