నవతెలంగాణ – సుల్తాన్ బజార్
హైదరాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ ప్రాంగణంలోకి తరలించిన అబిడ్స్ ట్రాఫిక్ నూతన పోలీస్ స్టేషన్ ను నగర అదనపు కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా అబిడ్స్ చౌరస్తాలో కొనసాగుతున్న అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను నాంపల్లి స్టేషన్ రోడ్డులోని పాత కలెక్టరేట్ భవనంలోకి మార్చారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్ సుధీర్ బాబు, డీసీపీ రాహుల్ హెగ్దే, అదనపు డీసీపీ రంగారావు, ఏసీపీ రత్నం, ఇన్ స్పెక్టర్ జి. శ్రీనివాస వర్మ, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.