సాహితీ సేద్యం చెసిన హాలీక కవి గంగుల సాయి రెడ్డి

నవవతెలంగాణ – హైదరాబాద్: రైతుగా నాగలి పట్టి వ్యవసాయం చేస్తూనే మరోవైపు కలం పట్టి సాహితీసేద్యం చేసిన హాలిక కవి గంగుల సాయి రెడ్డి అని రాష్ట్ర ఎస్.సి. కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై శతాబ్ది పూర్వ మహనీయులు యాదిలో కార్యక్రమాల లో భాగంగా గంగుల సాయి రెడ్డి సంస్మరణ నసమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బండ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ లో జన్మించిన భాగవత కర్త పోతన వ్యవసాయం చేస్తూనే కావ్య రచనలు చేసారని తదుపరి కాలంలో సాయి రెడ్డి ఆయనను అనుసరించిన భూమి పుత్రుడు అని వివరించారు పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ రైతుల జీవితాల్లోని చీకటి వెలుగులను కవితా వస్తువుగా సాహిత్య రచనలు చేసిన సాయి రెడ్డి సామాజిక సంస్కర్త అన్నారు. గీత రచయిత డాక్టర్ వడ్డేపల్లి క్రిష్ణ మాట్లాడుతూ సాయి రెడ్డి వంటి పలు తెలంగాణ కవులు మరుగు పడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి రచనలు నేటి తరాలకు అందించాల్సిన అవసరం వుందన్నారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి తెలంగాణ ఆవిర్భావ దశాబ్దు ఉత్సవాలలో గాన సభ ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంటె తమ వంతు గా సహకరిస్తామని తెలిపారు. సూరి భగవంతం ట్రస్ట్ చైర్మన్ ఎస్.బి.రామ్ పాల్గొన్నారు

Spread the love