ప్రశ్నించే గలం మూగబోయింది..

– మంత్రులు ఆలీ, హరీష్..
నవ తెలంగాణ – బంజారా హిల్స్
పేదల ప్రక్షాళన పోరాడే ప్రశ్నించే గలం  సియాసత్‌ ఉర్దూ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి చెందడం తీరని లోటని అన్నారు. ప్రజా ఉద్యమాలతో ప్రజాస్వామిక వాదులతో అన్ని రకాల కమ్యునిస్ట్లతో స్నేహ పూర్వక మైత్రితో కొనసాగిన ప్రజాస్వామిక రచయిత నాయకుడు అలీఖాన్, సెక్యులర్ భావాలు గల వ్యక్తి,కులమతాలకు అతీతంగా పనిచేశారు.దివంగత గద్దర్కి సన్నిహితులు కూడా ఆయనతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన సోమవారం  స్టేడియంలో కడసారిగా గద్దర్ని చూడడానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం చెందిడం దుర్భాంతిని కలిగించాలని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీమంత్రి కడియం శ్రీహరిలు జాహిరుద్దీన్ కుటుంబ సభ్యులను లక్డీకాపూల్‌లోని వారి నివాసంలో మంగళవారం  కలిసి పరామర్శించారు. ఖైరతాబాద్​ బీఆర్​ఎస్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి మన్నె గోవర్దన్​ రెడ్డి వారితో కలిసి పాల్గొన్నారు.
Spread the love