జిల్లెలగూడలో ఓపెన్ టెన్త్ క్లాసులను ప్రారంభించిన కార్పొరేటర్లు

నవతెలంగాణ – మీర్ పేట్ 
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ జిల్లెలగూడ 43వ డివిజన్ పరిధిలో ఓపెన్ టెన్త్ క్లాసులను డివిజన్ కార్పొరేటర్ గజ్జల రాంచందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ్ సెకండ్చాన్స్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లెలగూడ 43వ డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్లో క్లాసులు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గంగమ్మ, శోభ, లావణ్య, ప్రథమ్ సంస్థ సభ్యులు పరిమళ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love