– తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్
నవతెలంగాణ-జనగామ
ఆయిల్‌పామ్ మొక్కల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నర్సరీ కాంట్రాక్టర్లు రఘురాం రెడ్డి, సంబంధిత అధికారుల పై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో భూక్య చందు నాయక్ పాల్గొని మాట్లాడారు. జనగామ మండలం ఎల్లంల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీలో సుమారు 10లక్షల మొక్కల పెంచుతు న్నారని తెలిపారు. ఈ నర్సరీ నుండి అక్రమంగా వేల సంఖ్యలో పామాయిల్ మొక్కలు తరలిస్తున్నారని ఆరోపించారు. గుర్తించిన అర్హులైన రైతులకు సబ్సిడీపై ఇవ్వవలసిన పామాయిల్ మొక్కలు డబ్బులు దండుకునేందుకు కాంట్రాక్టర్ తో కలిసి సంబంధిత అధికారులు దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు అందజేస్తున్నారన్నారు. ఒక్క ఎకరం కూడా లేని వ్యక్తి పేరున అక్రమంగా ఫామ్ ఆయిల్ మొక్కలను తరలి స్తున్న వ్యక్తుల పైన, సంబంధిత అధికారులపై క్రిమి నల్ కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.