Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను వసూళ్లపై జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్...

ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను వసూళ్లపై జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్…

- Advertisement -

– నోటీసులకూ స్పందించని వ్యాపారుల ఆస్తుల సీజ్..
– డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ప్రతి వ్యాపారీ  ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జిహెచ్ ఎంసి గోషామహల్ సర్కిల్- 14 డిప్యూటీ మున్సి పల్ కమి షనర్ ఉమాప్రకాష్ అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిహె చ్ఎంసీ కమీషనర్ ఆదేశాల తో జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ లో   ఏఎంసిలు ట్రేడ్ లైసెన్స్ వెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ లు, మాల్స్, ఆర్కె ప్లాజా, బిగ్ బజార్,  తదితర కాంప్లెక్స్ లలో ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను పత్రాలు తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న  దుకా ణాలను సీజ్ చేశారు. జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది దుకాణాలను సీజ్ చేస్తుండటంతో మిగతా దుకాణాలకు చెందిన 16 షాపుల వ్యాపారులకు సంబధించిన రూ.3.5 లక్షల నగదు చెల్లించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు జారీ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మున్సి పల్ కమీషనర్ ఉమాప్రకాష్  మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలో వ్యాపారాలు నిర్వహించే వారు ఖచ్చి తంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిం చాలని కోరారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించని వారిపై, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారు ఎం తటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తి పన్ను బకాయి పడి, నోటీసులు జారీ చేసినా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్న 25 మందికి పైగా వ్యాపా రుల దుకాణాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అజీజ్లాజా కాంప్లెక్స్ లో వ్యాపారులకు సంబంధించి రూ.57.60 లక్షల ఆస్తి పన్ను పెండింగ్ లో ఉందన్నారు. కుశాల్ కాంప్లెక్స్, బిగ్ బజార్ లో స్పెషల్ డ్రైవ్ చేసినట్లు తెలిపారు. అపరాధ రుసులు లేకుండా నగర అభివృద్ధి కోసం బకాయిపడిన ఆస్తి పన్ను వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. ఆస్తి పన్ను చెల్లించని వారు తక్షణమే చెల్లిం చాలని, లేని పక్షంలో చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీలు, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -