Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆ ఇద్దరి కెప్టెన్సీ కలయికే గిల్‌

ఆ ఇద్దరి కెప్టెన్సీ కలయికే గిల్‌

- Advertisement -

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జోశ్‌ బట్లర్‌ వ్యాఖ్యలు
లండన్‌ (ఇంగ్లాండ్‌) :
టెండూల్కర-అండర్సన్‌ ట్రోఫీలో టీమ్‌ ఇండియా టెస్టు కెప్టెన్‌గా తొలి పరీక్షకు సిద్ధమవుతున్న యువ సారథి శుభ్‌మన్‌ గిల్‌పై ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోశ్‌ బట్లర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో జోశ్‌ బట్లర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున గిల్‌ సారథ్యంలో ఆడాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ నాయకత్వ లక్షణాల మేళవింపుతో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యం ఉంటుందని అన్నాడు. ‘శుభ్‌మన్‌ గిల్‌ నిజంగా ఆకట్టుకునే ఆటగాడు. నాయకుడిగా అతడి మాటలు ప్రశాంతంగా, కొలబద్దంగా ఉంటాయి. కానీ మైదానంలో అతడు భిన్నమైన నాయకుడు. భారత గత కెప్టెన్లు కోహ్లి, రోహిత్‌ శర్మ నాయకత్వ లక్షణాలు గిల్‌లో కనిపిస్తాయి. కోహ్లి దూకుడైన కెప్టెన్‌. భారత జట్టును అతడు ఎంతగానో రూపాంతరం చెందించాడు. రోహిత్‌ శర్మ ఎంతో కూల్‌గా ఉండే కెప్టెన్‌. కోహ్లి, రోహిత్‌ లక్షణాలు కనిపించినా.. శుభ్‌మన్‌ గిల్‌కు స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ గిల్‌కు కఠిన సవాల్‌. భారత క్రికెట్‌కు కోహ్లి కింగ్‌ అయితే, గిల్‌ ప్రిన్స్‌. బ్యాటింగ్‌ లైనప్‌లో నాల్గో స్థానం సైతం గిల్‌ తీసుకుంటాడని అనుకుంటున్నాను’ అని బట్లర్‌ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad