– దులీప్ ట్రోఫీ 2025
ముంబయి : ఈ నెల 28న ఆరంభం కానున్న దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో పోటీపడే నార్త్ జోన్ జట్టుకు టీమ్ ఇండియా టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ మేరకు నార్త్ జోన్ సెలక్టర్లు గురువారం జట్టును గురువారం ఎంపిక చేశారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అన్సుల్ కంబోజ్, సహా హర్షిత్ రానాలు నార్త్ జోన్ జట్టులో నిలిచారు. రంజీ ట్రోఫీలో గొప్పగా రాణించిన జమ్ము కశ్మీర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది. సెప్టెంబర్ 9 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌కు శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్‌లు ఎంపికైతే.. వాళ్ల స్థానంలో శుభమ్ రోహిలా గుర్నూర్ బరార్‌లు నార్త్ జోన్‌కు ఆడనున్నారు. ఆయుశ్ బదాని, యశ్ ధుల్, నిశాంత్ సింధు, సాహిల్, మయాంక్ డాగర్‌లు నార్త్ జోన్ జట్టులో ఉన్నారు.ఇదిలా ఉండగా, సెంట్రల్ జోన్ జట్టుకు భారత వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బెంచ్‌కు పరిమితమైన చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ సెంట్రల్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో మాయ చేయనున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టైటిల్ నెగ్గిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు సెంట్రల్ జోన్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్‌లు సైతం సెంట్రల్ జోన్ టీమ్‌లో నిలిచారు. మళ్లీ జోన్ ఫార్మాట్‌లో జరుగనున్న దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, వెస్ట్ జోన్‌కు శార్దుల్ ఠాకూర్, ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్‌లు కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
నార్త్ జోన్ కెప్టెన్‌గా గిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES