- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని పెద్దటాక్లి గ్రామానికి చెందిన గిరిజా దేశముఖ్ ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఎంబిబిఎస్ సీట్ ప్రభుత్వంకళాశాల కొత్తగూడెం లో సీట్ రావడం జరిగిందని ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాజాబాయి విలాస్ గైక్వాడ్ అభినందించారు. రాజేశ్వర్ దేశముక్ కు ఇద్దరు అడ్డ పిల్లలు. ఇందులో పెద్దకూతురు సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నారు. చిన్న కూతురుకి గిరిజ ఎంబిబిఎస్ సీట్ సాధించింది. మారుమూల గ్రామమైన పెద్ద టాక్లి గ్రామానికి ఆడపిల్లల చదువులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని గ్రామ మాజీ సర్పంచ్ పేర్కొన్నారు. పిల్లల చదువుల పట్ల తల్లి తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా గిరిజా దేశముఖ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -