- Advertisement -
సన్మానించిన AIBSS సంఘ సభ్యులు
నవతెలంగాణ – దర్పల్లి
ఈనెల హర్యాన రాష్ట్రంలోని సోనిపత్ లో జరిగిన అండర్ 16 కబడ్డీ పోటిల్లో మండలంలోని మద్దుల్ తండాకు చెందిన గిరిపుత్రిక గౌతమీ తన ప్రతిభను చాటి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్బంగా ఆదివారం మండల AIBSS మండల అధ్యక్షుడు మంగీత్య నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెగావత్ మంగిత్యా నాయక్, లక్ష్మణ్, దత్త నాయక్, కిషన్ నాయక్, ఉపాధ్యక్షులు నరేందర్, సంతోష్, మోహన్, గోపీచంద్, రమేష్, రెడ్యా, వసంత్ బాలు, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



