Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండెంగ్యూతో బాలిక మృతి

డెంగ్యూతో బాలిక మృతి

- Advertisement -

కొత్తూర్‌ మండలం ఎస్బీపల్లిలో విషాదం
నవతెలంగాణ-కొత్తూరు

డెంగ్యూ జ్వరంతో ఎనిమిదేండ్ల బాలిక ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండలంలోని ఎస్బీపల్లిలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్తపు రమేష్‌ చిన్న కుమార్తె వాసుప్రియ(8) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నది. పది రోజులుగా ఆమె జ్వరంతో బాధపడటంతో స్థానికంగా చికిత్స చేయించారు. తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి డెంగ్యూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ బాలిక పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందింది.

పారిశుధ్య పనులు చేపట్టాలి : గ్రామస్తుల డిమాండ్‌
బాలిక మృతితో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే విషయమై మండల వైద్యాధికారి డాక్టర్‌ దీప్తిని వివరణ కోరగా.. చిన్నారి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడిం దని తెలిపారు. తమ సిబ్బంది చిన్నారిని పరీక్షించారని, అప్పుడు డెంగ్యూ లక్షణాలు కనిపించలేదని చెప్పారు. గ్రామంలో ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నారని, జ్వరంతో బాధపడుతున్న కేసులు నమోదు కాలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -