Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన బాలికలు

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన బాలికలు

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మన మిర్యాలగూడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాఖలవాడి బాలికల జట్టు విజయం సాధించి పదిహేను వేల రూపాయలు రూపాయల నగదు బహుమతి వ్యవస్థాపక అధ్యక్షులు మన్యం శ్రీధర్ రెడ్డి నుండి స్వీకరించడం జరిగింది. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి బాలికల జట్టును అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుండో, కబడ్డీ క్రీడా అమలులో ఉందని, నేడు కూడా ప్రో కబడ్డీ క్రీడా ఎంతోమంది క్రీడాకారులను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుండి బాలికలు క్రీడా పోటీలయందు పాల్గొని, విజయంసాధిస్తూ ఉన్నత స్థితిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పంగ సైదులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -