బాలికల పాఠశాలలో పోషణ మాసం: సిడిపిఓ రేఖల మమత
నవతెలంగాణ – మిర్యాలగూడ
పోషకాహారం తీసుకొని వ్యక్తిగత పరిశుభ్రత వర్తకూరు పాటించాలని సిడిపిఓ రేకల మమత కోరారు. గురువారం పట్టణంలోని గాంధీనగర్ సెక్టార్ పరిధిలో బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ మాసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పౌష్టిక అనుబంధ ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ప్రకృతి సిద్ధంగా దొరికే అటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యకరంగా ఉంటామని ప్రతి ఇంట్లో పెరటి తోటను పెంచుకోవాలని సేంద్రీయ ఎరువులతో కూడిన పంటలు పండించుకొని ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత ఎలాంటి పద్ధతులను పాటించాలని, చిరుదాన్యాలను పౌష్టికాహార వంటలను వారి ముందు ప్రదర్శించి పోషకాహార ప్రాముఖ్యతను గురించి, ప్రస్తుత కాలంలో అధికంగా డయాబెటిస్, షుగర్ తదితర వ్యాధులు పెరుగుతున్న కారణంగా సరియైన పౌష్టికాహారం తీసుకోవాలని వివరించారు.
అనంతరం పిల్లలకు పౌష్టికాహారం పైన వ్యాస రచన పోటీలు నిర్వహించి, ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులను బాలికలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నజీమా బేగం. మొహ్మద్,స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్..విజయకుమారి పాఠశాల టీచర్స్, బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత అంగన్వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.