నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలో 12 రోజులపాటు శిక్షణ పొంది పెద్దపల్లిలో జరుగుతున్న స్టేట్ మీట్ లో వరుసగా మూడు విజయాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళ జట్టు కైవసం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు కొనసాగి రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల మహిళల 58వ ఖోఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న పాలమూరు విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా క్రీడాకారులు మాట్లాడుతూ.. మాకు శిక్షణతో పాటు సలహాలు సూచనలు ఇచ్చి, విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు విలియం, మదు కుమార్ లకు ఆర్గనైజర్ గోకమళ్ళ రాజుకు కోచ్ పురణ్ చంద్, ప్రకాష్, జగన్, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి మొదటి ప్లేస్ కొట్టేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
వరుసగా మూడు విజయాలను కైవసం చేసుకున్న గర్ల్స్ టీం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



