రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
నిర్మల్ జిల్లా ధర్మాసాగర్ చెరువు ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణ చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి రెగ్యులర్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ధర్మసాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఎన్.శ్రవణ్ పిల్ దాఖలు చేశారు. దీనికి నెంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ న్యాయవాది వాదించారు. కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన చర్యలు లేవన్నారు. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పిల్‌ను విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.
ప్రొఫెసర్ ఖాసీంపై క్రిమినల్ కేసులు కొట్టేసిన హైకోర్టు
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఖాసీం ఓయూ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాంపస్‌లో నిరసనలు చేపట్టొద్దని అభియోగం ఉంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఖాసీం వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారించారు. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ..సీఆర్‌పీసీ సెక్షన్ 195 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్ప ఐపీసీలోని 188 సెక్షన్ కింద కేసు నమోదుకు వీలులేదన్నారు. పోలీసుల చర్య చట్ట వ్యతిరేకమన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. రెండు కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
అక్రమ నిర్మాణాలపై పిల్‌కు నెంబర్ ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



