నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపత్రిలోని 104 సర్వే నెంబర్‌లో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సదరు భూమిని భూదాన్‌గా గుర్తించి సర్క్యులర్లు జారీ చేశారు. అయితే ఆ భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్‌కు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్ చేశారు. దీంతో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణలో రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా పరిగణించి ఎకరాకు రూ.16లక్షల చొప్పున రూ.40కోట్ల పరిహారం చెల్లించారు. ఇటీవల ఈ మోసం బహిర్గతమైంది. ఈ క్రమంలో.. భూముల ఆక్రమణతో పాటు ఔషధ పరిశ్రమ భూ సేకరణ కింద పరిహారం పొందిన అంశంపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.
భూదాన్ భూముల అన్యాక్రాంతంపైనివేదిక ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES