Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

- Advertisement -

– సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఒక్కసారి అవకాశం ఇస్తే నాలుగో వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని సీపీఐ(ఎం) నాలుగో వార్డు అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ ప్రజలను కోరారు. మంగళవారం ఆమె నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ.. ఈరోజు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాలుగో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగో వార్డులో అనేక సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యంగా తాగునీటి కొరత,డ్రైనేజీ సమస్యలు,సీసీ రోడ్ల లేమి,పారిశుధ్య లోపాలు వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ,వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలను ముందుగా తెలుసుకొని ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపడతానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి తర్వాత మాయమయ్యే నాయకులు కాకుండా,ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా నిలబడతానని అన్నారు.

అలాగే వార్డులో పరిశుభ్రత నిర్వహణను మెరుగుపరచి,చెత్త సేకరణ వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో అవినీతి లేకుండా పారదర్శకతతో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని,ప్రజల సమస్యలు పరిష్కరించే నిజమైన నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని ఆమె అన్నారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొంటూ,నాలుగో వార్డు ప్రజలు ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చివరగా నాలుగో వార్డు ప్రజలు ఈరోజు జరిగే ఎన్నికల్లో సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె మరోసారి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -