Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంరీజినల్‌ రింగు రోడ్డుకు అనుమతులిప్పించండి

రీజినల్‌ రింగు రోడ్డుకు అనుమతులిప్పించండి

- Advertisement -

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ రెడ్డి
రీజినల్‌ రింగు రోడ్డుకు అనుమతులిప్పించండి


న్యూఢిల్లీ : రీజినల్‌ రింగు రోడ్డుకు (నార్త్‌ పార్ట్‌) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందని, పనుల ప్రారంభించేందుకు ఆర్థిక, క్యాబినెట్‌ అనుమతులు ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కోరారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనుగుణంగా రీజినల్‌ రింగు రోడ్డు (సౌత్‌ పార్ట్‌)కు అనుమతులు ఇప్పించాలని కోరారు. రావిర్యాల-ఆమన్‌గల్‌-మన్ననూర్‌ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మన్ననూర్‌-శ్రీశైలం (ఎన్‌హెచ్‌ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాలని కోరారు. హైదరాబాద్‌-మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ దేశ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారికి అనుమతి ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -