Thursday, February 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏఐ వినియోగంపై ప్రణాళికలు ఇవ్వండి

ఏఐ వినియోగంపై ప్రణాళికలు ఇవ్వండి

- Advertisement -

ఎడోబ్‌ సీఈవోతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్థికవ్యవస్థపై ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం, భవిష్యత్‌లో దాని సక్రమ వినియోగంపై ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలనీ సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఎడోబ్‌ సీఈఓ, తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌బోర్డ్‌ సభ్యులు శంతన్‌ నారాయణ్‌ను కోరారు.

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శంతన్‌నారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. గ్లోబల్‌ ట్రెండ్స్‌, అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌కు అంశాలపై మాట్లాడుకున్నారు. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్‌ పవర్‌గా తీర్చిదిద్దేందుకు, ముఖ్యమైన సంస్థల్ని ఆకర్షించేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలని సీఎం కోరారు. దీనికి శంతన్‌ నారాయణ్‌ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -