బీసీసీఐ ఆఫీస్‌బేరర్లకు అల్లీపురం వినతి
ముంబయి : 9 దశాబ్దాలుగా తీరని అన్యాయానికి గురైన గ్రామీణ క్రికెట్‌కు న్యాయం చేకూర్చేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐ ఆఫీస్ బేరర్లను ఆ సంఘం అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కొత్త ఆఫీస్ బేరర్లు మిథున్ మన్హాస్, దేవాజిత్ సైకియా, ప్రభుతేజ్ సింగ్ సహా ఐసీసీ చైర్మెన్ జై షాకు అల్లీపురం వినతి పత్రాలు సమర్పించాడు. హెచ్‌సీఏ హైదరాబాద్‌కు 220 క్లబ్ జట్లు ఇవ్వగా.. 32 జిల్లాల తరఫున కేవలం 9 జట్లు మాత్రమే ఆడుతున్నాయి. అవినీతి, అక్రమాల్లో కూరుకున్న హెచ్‌సీఏ దృష్టి గ్రామీణ క్రికెట్ అభివృద్దిపై లేదు. టీడీసీఏకు గుర్తింపుతోనే తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని అల్లీపురం లేఖలో పేర్కొన్నారు.